పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడె గిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ….
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి
గిత్త కోత కొమ్ము కోడే
వంచలేని కోడె… ఒంగోలు కోడే
సిరిగల కోడే… సిరిసిల్ల కోడే
హ, ఎల ఎల కోడే… ఉజ్జయిని కోడే
రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే, హాయ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
రయా రయ్యా రగతము లేలెమ్మనే
దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే
ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే
అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే
ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా
డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా
మోత కూత కోత కోట
తూట వేట తురుము కోడే
కసిగల కోడే… కలకత్తా కోడే
గుజ్జిగల కోడే… గుజరాతి కోడే
కత్తిలాంటి కోడే గిత్తూరు కోడే
తిరుగేలేనిది తిరునల్వేలి కోడే, హాయ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టు చుట్టు చుట్టు చుట్టు
చుట్టర చుట్టు తలపాగ చుట్టరా
పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా
జబ్బలు రెండు చరిచి జై కొట్టరా
మన ఒక్కో గొంతు కోట్లాది బెట్టురా
చూడరా మల్లేశా… చుట్టమైనది భరోసా
కుమ్మర గణేశా… కూడగట్టర కులాసా
అస్స బుస్స గుట్ట గిట్ట
గింజ గుంజ కంచు కోడే
(భల్లె భల్లె భల్లె భల్లె భల్లే)
పంతమున్న కోడే…. పంజాబి కోడే
తద్దెనన కోడే… టంగుటూరి కోడే
పౌరుషాల కోడే… బల్లాసి కోడే
విజయ విహారమే… వీర మరాఠ కోడే, హొయ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
ఉరుము ఉరుము ఉరుము ఉరుము
ఉరుమురు మురుమురుమురుమురు
మురుమురుమురు మురుమురు
ఉరుమురుమురుమురు
No comments:
Post a Comment
If you have any doubts, Please let me know