భీమా
నిను గన్న నేలతల్లి
ఊపిరి బోసిన సెట్టు సేమ
పేరు బెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా
ఇనపడుతుందా
కొమురం భీముడో
కొమురం భీముడో
కోర్రాసు నెగడోలే మండాలి కొడుకో
మండాలి కొడుకో
కొమురం భీముడో
కొమురం భీముడో
రగరాగ సూరీడై రగలాలి కొడుకో
రగలాలి కొడుకో
కాల్మొక్తా బాంచెహాని వొంగి తోగాల
కారడవి తల్లికి పుట్టానట్టేరో
పుట్టానట్టేరో
జులుము గద్దెకు తలను ఒంచితోగాలా
జుడుము తల్లి పేగున పెరగానట్టేరో
పెరగానట్టేరో
కొమురం భీముడో
కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో
మండాలి కొడుకో
సెర్మమొలిసే దెబ్బకు ఒప్పంటోగాల
సిలికే రత్తము సూసి సెదిరేతోగాల
బుగులేసి కన్నీరు ఒలికితోగాల
భూతల్లి సనుబాలు తాగనట్టేరో
తాగానట్టేరో
కొమురం భీముడో
కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో
మండాలి కొడుకో
కాలువై పారే నీ గుండె నెత్తురు
కాలువై పారే నీ గుండె నెత్తురు
నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు
అమ్మకాళ్ల పారాణైతుంది సూడు
తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు
కొమురం భీముడో
కొమురం భీముడో
పుడమి తల్లికి జనమ
హరణమిస్తివిరో
కొమురం భీముడో
No comments:
Post a Comment
If you have any doubts, Please let me know